క్వాలిటీ, క్వాంటిటీకి ప్రాధాన్యత..గురుకులాల్లో విద్య, మౌలిక వసతుల బలోపేతం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

క్వాలిటీ, క్వాంటిటీకి ప్రాధాన్యత..గురుకులాల్లో విద్య, మౌలిక వసతుల బలోపేతం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • యూనిఫామ్స్, షూస్, బుక్స్​సకాలంలో అందాలి
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, ఎస్సీ శాఖ  పరిధిలోని హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్, పుస్తకాలు తదితర వస్తువులు ఆలస్యం లేకుండా అందించాలని ఆదేశించారు. శనివారం సెక్రటేరియట్ లో గురుకులాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పీఎంయూ ద్వారా  చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ప్రతి అంశానికి నిర్దిష్ట గడువు నిర్ణయించి, పురోగతిపై నివేదికలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల పారిశుద్ధ్య, స్కావెంజర్స్ సేవలను సమర్థంగా నిర్వహించేందుకు తగిన విధానం రూపొందించాలన్నారు. స్థానిక అవసరాలను బట్టి కాంటింజెన్సీ సిబ్బందిని వినియోగించడంతో పాటు, అవసరమైతే పారదర్శక ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ టెండర్‌‌‌‌ విధానాన్ని పరిశీలించాలని సూచించారు.  సిబ్బంది వేతనాలను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

తరగతి గదులు, వంటశాలలు, తాగునీరు, ఆర్‌‌‌‌ఓ ప్లాంట్లు, వాషింగ్‌‌‌‌ సదుపాయాలు, శానిటేషన్‌‌‌‌, అవసరమైన పరికరాలను ఒకే ప్రణాళికలో చేర్చాలన్నారు. అనంతరం హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లోని 6,027 మీటర్ల (19,774 అడుగుల) ఎత్తైన మౌంట్‌‌‌‌ తరంగ్‌‌‌‌-2 శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్‌‌‌‌ బన్నీని సెక్రటేరియట్ లో మంత్రి లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు.